RRR Case: రఘురామ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Raghurama case Supreme Court orders to conduct tests at Secunderabad Army hospital
x

Supreme Court 

Highlights

RRR Case: రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

RRR Case: రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. రఘురామ వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రికి రఘురామను తరలించాలని సూచించింది. ఆర్మీ ఆస్పత్రిలో మెడికల్‌ పరీక్షలకు అనుమతిచ్చిన సుప్రీం.. పరీక్షల సమయంలో వై కేటగిరి భద్రత ఉండాలని ఆదేశించింది. వైద్య పరీక్షలను వీడియోగ్రఫీ తీయాలని, నివేదికను సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు అందజేయాలని సూచించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని సుప్రీంకోర్టుకు సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే విన్నవించారు. సీనియర్‌ జ్యుడీషియల్‌ అధికారి సమక్షంలో వైద్య పరీక్షలకు సిద్ధమని స్పష్టం చేసారు. సమీపంలో ఆర్మీ ఆస్పత్రులున్నాయా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, 300 కి.మీ. దూరంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రి ఉందని, విశాఖలో నేవీ ఆస్పత్రి కూడా 300 కి.మీ దూరంలో ఉందని లాయర్‌ రావు తెలిపారు. విశాఖలో తుఫాను పరిస్థితులున్నాయని.. కేంద్రం ఆధీనంలోని మంగళగిరి ఎయిమ్స్‌ అన్నింటికంటే దగ్గరగా ఉందని లాయర్‌ దవే వివరించారు. రఘురామకృష్ణరాజుకు ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories