'సీఎస్-137 తో ప్రమాదమేమీ లేదు'

సీఎస్-137 తో ప్రమాదమేమీ లేదు
x
Highlights

ఓఎన్జీసీలో రేడియో ధార్మిక పరికరం సీఎస్‌ 137 కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు... ఈ మేరకు అసెట్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ శేఖర్...

ఓఎన్జీసీలో రేడియో ధార్మిక పరికరం సీఎస్‌ 137 కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు... ఈ మేరకు అసెట్‌ మేనేజర్‌ డీఎంఆర్‌ శేఖర్ వెల్లడించారు. మిస్ అయిన సీఎస్‌ 137 తో పెద్ద ప్రమాదమేమీ లేదని నిపుణులు కూడా స్పష్టం చేశారని తెలిపారు. దీని సామర్థ్యం 2.2 క్యూరియంలు మాత్రమేనని... దీని ప్రభావం 2 మీటర్ల పరిధి మాత్రమే ఉంటుందని శేఖర్‌ అన్నారు. దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు. కాగా భూమిలో వేల అడుగుల లోతులో నిక్షిప్తమైన చమురు, సహజవాయువు నిక్షేపాలను కనుగునేందుకు సీఎస్-137 ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించే సమయంలో ముంబైలోని హోమిబాబా అణుపరిశోధన సంస్థ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories