Vizianagaram: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం

Pydithalli Ammavaru Sirimanu Utsavam in Vizianagaram
x

Vizianagaram: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభం

Highlights

Vizianagaram: సిరిమాను చెట్టుకు పూజలు చేయడానికి పోటెత్తుతున్న భక్తులు

Vizianagaram: విజయనగరం పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవానికి మొదటి అంకం మొదలయింది. పైడితల్లి అమ్మ వారు... పూజారికి కలలో కనిపించి చెప్పడంతో చెట్టుకు బొట్టు పెట్టి... పూజలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సిరిమాను చెట్టుకు పూజలు చేయడానికి భక్తులు పోటెత్తుతున్నారు.

పైడితల్లి అమ్మ వారి సిరిమాను చెట్టును సిరిపురం గ్రామంలో గుర్తించారన్న సమాచారంతో భక్తులు భారీగా తరలివచ్చి ఆ చెట్టుకు పూజలు చేస్తున్నారు. తమ గ్రామంలోని చెట్లను అమ్మ వారు సూచించడంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేవు. జంటగా పుట్టిన 15 అడుగుల చింతచెట్లను పైడితల్లి అమ్మ వారు పూజారికి కలలో సూచిస్తారు. దీంతో ఆ చెట్లకు పూజలు చేసి సిరిమానుకు ఉపయోగిస్తారు.

ప్రతి ఏటా దసరా తరువాత పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవం జరుగుతుంది. దీంతో నెలరోజుల ముందు నుంచే విజయనగరంలో పండుగ వాతావరణం నెలకొంది. విజయనగరం రాజవంశానికి చెందిన పైడితల్లి అమ్మ వారు తమ గ్రామంలో చెట్లను కోరుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అమ్మ వారి కరుణాకటాక్షాలు తమపై ఉండాలని వేడుకుంటున్నామని భక్తులు చెప్పారు.

ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మ వారి సిరిమానోత్సవానికి విజయనగరం ముస్తాబవుతోంది. సిరిమానుకు చెట్టును గుర్తించడంతో మొదలైన పంగుగ సిరిమానోత్సవంతో ముగియనుంది. దీంతో భక్తులు పైడితల్లి అమ్మ వారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ.. భక్తి పారవశ్యాన్ని పొందుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories