ఆన్‌డ్యూటీగా పరిగణించండి : సీఎం జగన్ కు పీవీ సింధు విజ్ఞప్తి

ఆన్‌డ్యూటీగా పరిగణించండి : సీఎం జగన్ కు పీవీ సింధు విజ్ఞప్తి
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన సింధు జగన్‌ను...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన సింధు జగన్‌ను కలిసి ఏపీలో డిప్యూటీ కలెక్టర్‌గా కొనసాగుతున్న తనను టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఆన్‌డ్యూటీగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఆమె విజ్ఞప్తిపై సీఎం వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా సింధుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. అలాగే విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ స్థలం అన్వేషణ జరుగుతోందని.. ఎక్కడ అవసరమైతే అక్కడ స్థలం ఎంపిక చేసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ సింధుకు సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories