ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్న పీవీ సింధు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవనున్న పీవీ సింధు
x
Highlights

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు...

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలవనున్నారు సింధు. అనంతరం 12 గంటల 30 నిమిషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. కాగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌‌ పసిడి పతకాన్ని పీవీ సింధు ఇటీవల సాధించారు. జపాన్ షట్లర్ ఒకుహరాతో బాసెల్‌ (స్విట్జర్లాండ్) వేదికగా జరిగిన ఫైనల్లో 21-7, 21-7 తేడాతో సింధు అలవోకగా నెగ్గి.. ఈ టోర్నీలో స్వర్ణం సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డ్‌ నెలకొల్పిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories