తిరుమలేశుని సన్నిధిలో పుష్పయాగ మహోత్సవం

Tirumala: సంపంగె ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని అధిష్టింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు

R Tripura Malini
Published on: 2 Nov 2022 7:44 AM IST
Pushpa Yagam Celebrations in Tirumala was an eye feast for devotees
X

తిరుమలేశుని సన్నిధిలో పుష్పయాగ మహోత్సవం

Tirumala Tirupati Devasthanam: సంపంగె ప్రాకారంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని అధిష్టింపజేసి ప్రత్యేకపూజలు నిర్వహించారు. సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపించారు.దివ్యాలంకార శోభితులైన తిరుమలేశునికి, ఉభయనాంచారీ సమేతంగా పుష్పనివేదన చేశారు. మధ్యాహ్నంనుంచి సాయంత్రందాకా పుష్పయాగం వైభవాన్ని సంతరించుకుంది. మరువం, దవణం, తులసి, సంపంగి, మొగలిరేకులు, గులాబీలు వంటి పుష్పాలతో మలయప్పస్వామివారిని అర్చించారు. శ్రీవారి సమేత శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పుష్పయాగంతో ఆరాధించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story