జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు

జగన్ ప్రభుత్వంపై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు
x
పురందేశ్వరి పైల్ ఫోటో
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వంపై కేంద్రమాజీ మంత్రి బీజేపీ నేత పురందేశ్వరి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల...

వైఎస్ జగన్ ప్రభుత్వంపై కేంద్రమాజీ మంత్రి బీజేపీ నేత పురందేశ్వరి విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం వల్ల ఆంధ్రాకి తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. అమరావతి రైతులకు న్యాయం ఎవిధంగా చెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనమండలి రద్దు చేయడంపై పురందేశ్వరి పలు వ్యాఖ్యలు చేశారు.

మండలి రద్దు వల్ల ఉపయోగం లేదని చెబుతున్న ప్రభుత్వం.. కేబినెట్ సమావేశంలో మండలి రద్దు కోరుతూ తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రాకి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని.. లేదంటే తామూ చూస్తూ ఊరుకునేది లేదని విమర్శించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా శాసనమండలిని ఎందుకు రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారని.. గతంలో ఆయన మండలి రద్దు చేయాలని కోరిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.

వైసీపీ,టీడీపీ ప్రజల సమస్యల గురించిన పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెండు పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాయని, ప్రజలు హర్షించడం లేదని తెలిపారు. అధికార ప్రతిపక్షాలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని వ్యాఖ్యానించారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలు ప్రజలు స్వాగతిస్తున్నారని వ్యా్ఖ్యానించారు. వైసీపీ, టీడీపీ సిద్ధాంతాలు బీజేపీకి వ్యతిరేకమని, స్వార్థపూరిత పార్టీలో బీజేపీ పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జనసేనతోనే కలిసి పని చేస్తామని మరోసారి తేల్చి చెప్పారు.

ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాకి పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. ఆర్థికలోటులో పథకాలు ఎలా అమలు చేస్తారో చెప్పలేకపోతున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైందని, కూలీల జీవితాలు నాశనం అయ్యియిని ఆరోపించారు. రాష్ట్రంలో కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప అభివృద్ధి శూన్యమని విమర్శిచారు. పోలవరం పనులు సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories