Purandeswari: ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఖండించిన పురందేశ్వరి

Purandeswari Condemns Raghurama Krishna Raju Arrest
x

Purandeswari:(File Image) 

Highlights

Purandeswari: న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వైసీపీ నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారని పురందేశ్వరి ప్రశ్నించారు.

Purandeswari: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ను అరెస్టు చేయడం పై బీజేపీ మహిళా నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ఖండించారు. ... ప్రతిష్ఠకు భంగం కలిగేలా మాత్రమే కాదు, న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడిన అదే పార్టీకి చెందిన నేతలను ఎంతమందిని అరెస్ట్ చేశారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది" అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశాడంటూ ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఆయన నివాసంలో అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలకు అతీతంగా రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను తప్పుబడుతున్నారు.గత కొంతకాలంగా రఘురామకృష్ణరాజుకు, వైసీపీ పెద్దలకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఆ యుద్ధం మరింత ముదిరింది. తాజా అరెస్టుతో అది పరాకాష్టకు చేరింది. ఈ అంశం పై రాఘురామ హైకోర్టు ఆశ్రయించగా ఈ రోజు విచారణ జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories