పీఎస్సార్‌ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు

పీఎస్సార్‌ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు
x
Highlights

పీఎస్సార్‌ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు పీఎస్సార్‌ ఆంజనేయులుకు ఏపీపీఎస్సీ బాధ్యతలు

ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) కార్యదర్శిగా రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌ పీఎస్సార్‌ ఆంజనేయులుకు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకూ ఉన్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ మౌర్యను బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే బయో డైవర్సిటీ బోర్డు సభ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఎఫ్‌ఎస్‌ అధికారి పీవీ చలపతిరావును రిలీవ్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories