PSLV-C62 లాంచ్‌కు కౌంట్‌డౌన్: జనవరి 12న శ్రీహరికోట నుంచి నింగిలోకి

PSLV-C62 లాంచ్‌కు కౌంట్‌డౌన్: జనవరి 12న శ్రీహరికోట నుంచి నింగిలోకి
x

PSLV-C62 లాంచ్‌కు కౌంట్‌డౌన్: జనవరి 12న శ్రీహరికోట నుంచి నింగిలోకి

Highlights

జనవరి 12న ఇస్రో PSLV-C62 వాణిజ్య ప్రయోగం శ్రీహరికోట నుంచి జరగనుంది. EOS-N1తో పాటు 16 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) మరో కీలకమైన వాణిజ్య అంతరిక్ష ప్రయోగానికి సిద్ధమైంది. జనవరి 12 ఉదయం 10:17 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తొలి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV-C62 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) నిర్వహిస్తున్న ఈ ప్రయోగం ఇస్రోకు 9వ వాణిజ్య మిషన్‌గా నిలవనుంది.

ఈ మిషన్‌లో ప్రధాన ఉపగ్రహం EOS-N1తో పాటు దేశీయ, అంతర్జాతీయ వినియోగదారులకు చెందిన మొత్తం 15 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం రాకెట్ అనుసంధాన పనులు పూర్తయ్యాయి. ప్రీ-లాంచ్ తనిఖీలు చివరి దశకు చేరుకున్నాయి.

PSLV శ్రేణిలో ఇది 64వ ప్రయోగం కాగా, రెండు సాలిడ్ స్ట్రాప్-ఆన్ మోటార్లు కలిగిన ‘PSLV-DL’ వేరియంట్‌ను ఈసారి ఉపయోగిస్తున్నారు. ఈ ప్రయోగంలో స్పెయిన్‌కు చెందిన స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘KID’ అనే రీ-ఎంట్రీ వెహికల్ ప్రోటోటైప్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మిషన్ పూర్తైన తర్వాత ఈ వాహనం భూ వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది.

చంద్రయాన్-1, మంగళయాన్, ఆదిత్య-L1 వంటి చారిత్రాత్మక విజయాలను సాధించిన PSLV వాహక నౌక, ఇస్రోకు అత్యంత నమ్మకమైన ‘వర్క్‌హార్స్’గా గుర్తింపు పొందింది. PSLV-C62 ప్రయోగం కూడా అదే స్థాయిలో విజయవంతమవుతుందనే విశ్వాసం వ్యక్తమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories