PSLV-C55 Rocket: రేపు శ్రీహరికోట నుంచి PSLV -C55 రాకెట్ ప్రయోగం

PSLV-C55 Rocket Launch From Sriharikota Tomorrow
x

PSLV-C55 Rocket: రేపు శ్రీహరికోట నుంచి PSLV -C55 రాకెట్ ప్రయోగం

Highlights

PSLV-C55 Rocket: ఈ రోజు 12గంటల 50 నిమిషాలకు ప్రారంభం కానున్న కౌంట్ డౌన్

PSLV-C55 Rocket: రేపు శ్రీహరి కోట నుంచి PSLV -C55 రాకెట్ ప్రయోగం జరుగనుంది. మరికాసేపట్లో ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. PSLV -C55 రాకెట్ ప్రయోగం రేపు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు జరుగుతుంది . అందుకుగానూ ఈ రోజు 12 గంటల 50 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమై 25 గంటల 30 నిమిషాల పాటు కొనసాగుతుంది . ఇస్రో ఈ ఏడాదిలో శ్రీహరి కోట రాకెట్ కేంద్రం నుంచి 12 ప్రయోగాలు చేయడంమే లక్షంగా పెట్టుకుంది .ఇందుకోసం ఇస్రో శ్రీహరికోట షార్‌ లో ప్రత్యేక వసతులను కూడా సమకూర్చుంది.

అయితే ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్య ప్రయోగం. ఇప్పటికే ఇస్రో ప్రయోగించిన పూర్తి స్థాయి వాణిజ్య ప్రయోగాలలో ఇది ఐదవది. కాగా ఇందులో సింగపూర్ దేశానికి చెందిన టెలియోస్-2 ఉపగ్రహంను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత GSLV రాకెట్ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని అన్నారు. ఆతర్వాతనే చంద్రయాన్ 3 ,ఆదిత్య ప్రయోగాలు ఉంటాయని ఇస్రో ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories