శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ -49 రాకెట్

శ్రీహరి కోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ -49 రాకెట్
x
Highlights

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ను సైంటిస్టులు సూర్యవర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఈఏఎస్‌-01తోపాటు 9విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసీలోకి పంపింది.

నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి పీఎస్‌ఎల్వీ సీ-49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్‌ను సైంటిస్టులు సూర్యవర్తన కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఈఏఎస్‌-01తోపాటు 9విదేశీ ఉపగ్రహాలను ఇస్రో రోదసీలోకి పంపింది. పీఎస్‌ఎల్వీ సీ-49 బరువు 290 టన్నల బరువు ఉందని సైంటిస్టులు తెలిపారు. భారత్ పంపిన ఉపగ్రహం ద్వారా వాతావరణ విపత్తులు, అడవులపై పరిశోధన చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా మహమ్మారి మధ్య ఇస్రో ఈ ఏడాది చేపడుతున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం విశేషం.. ఇక ఈ మిషన్‌ పూర్తయిన వెంటనే డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్‌వీ) పరీక్షించేందుకు ఇస్రో సన్నద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories