11న పీఎస్ఎల్వి-సి 48 రాకెట్ ప్రయోగం...ఒకేసారి 10 ఉపగ్రహాలు నింగిలోకి

11న పీఎస్ఎల్వి-సి 48 రాకెట్ ప్రయోగం...ఒకేసారి 10 ఉపగ్రహాలు నింగిలోకి
x
పీఎస్ఎల్వి - సి 48 రాకెట్
Highlights

శ్రీహరికోట నుండి రెండు వారాల వ్యవధిలోనే మరో రాకెట్ ప్రయోగానికి శాస్ర్తవేత్తలు సిద్ధమవుతున్నారు.

సూళ్ళూరు పేట: శ్రీహరికోట నుండి రెండు వారాల వ్యవధిలోనే మరో రాకెట్ ప్రయోగానికి శాస్ర్తవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 11న షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి పీఎస్ఎల్వి - సి 48 రాకెట్ ను ప్రయోగించేందుకు తుది ఏర్పాట్లు చేపట్టారు. ఈ రాకెట్ ద్వారా ఆర్ఐ శాట్-2 బి-ఆర్1 ఉపగ్రహాన్ని అంతరిక్షం లోకి ప్రవేశ పెట్టనున్నారు. ఈ రాడార్ ఇమేజింగ్, ఎర్త్ అజ్జర్వేషన్ శాటిలైట్ బరువు 628 కిలోలు భూ పరిశీలన కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది.

దీంతో పాటు 9 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నారు. ఇందులో ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్ లకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం తో పాటు యుఎస్ కు చెందిన 6 ఉపగ్రహాలు ఉన్నాయి. ఒకే రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలను భూమికి 576 కి.మీ కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు శాస్ర్తవేత్తలు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే పీఎస్ఎల్వి-సి 48 రాకెట్ షార్ నుండి ప్రయోగిస్తున్న 75 వ ఉపగ్రహ ప్రయోగ నౌక పీఎస్ ఎల్వి రాకెట్ లలో ఇది 50 వది మొదటి ప్రయోగ వేదిక నుండి 37వ ప్రయోగం నాలుగు స్ట్రపాన్ బూస్టర్ల తో దీనిని నిర్మించారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 11 న మధ్యాహ్నం 3.25 గంటలకు రాకెట్ ను ప్రయోగించే అవకాసం ఉంది.గత నెల 27 న పీఎస్ఎల్వి-47 రాకెట్ ను షార్ లోని సెకండ్ లంచ్ ప్యాడ్ నుండి విజయవంతంగా ప్రయోగించారు. ఇప్పుడు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుండి తాజా రాకెట్ ను ప్రయోగిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories