Visakhapatnam: కడుబండి శ్రీనివాస్‌కు ఝలక్‌.. ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నిరసన

Protest Against Kadubandi Srinivasa Rao
x

Visakhapatnam: కడుబండి శ్రీనివాస్‌కు ఝలక్‌.. ఎమ్మెల్యే మాకొద్దు అంటూ నిరసన

Highlights

Visakhapatnam: ఎమ్మెల్యే సరిగా నిర్వహించలేదని స్థానిక నాయకుల ఆరోపణ

Visakhapatnam: విశాఖ జిల్లా ఎస్‌కోట నియోజకవర్గం ఎమ్మెల్యే తమకు వద్దంటూ.. వచ్చే ఎన్నికల్లో స్థానికులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ నుంచి ఎస్ కోట టికెట్ స్థానికులకు ఇవ్వాలంటూ పార్టీ కార్యాలయం వద్ద నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడుబండి శ్రీనివాస్ కాకుండా స్థానికులకు ఇవ్వాలని 5 మండలాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, డైరెక్టర్‌లు డిమాండ్ చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కూడా ఎమ్మెల్యే సరిగా నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. ఎస్ కోట నియోజకవర్గంలో కనీసం ప్రోటోకాల్ పాటించకుండా ప్రభుత్వ కార్యక్రమాలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐ ప్యాక్ టీమ్ కూడా ప్యాకేజ్ తీసుకుంటూ.. వారికి అనుగుణంగా ప్రచారాలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories