TDPకి ఇది తాత్కాలిక ఊరటేనా.. అంతిమంగా ఆపే శక్తి లేదా?

TDPకి ఇది తాత్కాలిక ఊరటేనా.. అంతిమంగా ఆపే శక్తి లేదా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి భారీ షాక్...

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వానికి భారీ షాక్ తగిలినట్లయింది. టెక్నీకల్ గా నైతికంగా ప్రభుత్వం ఓడిపోయిందని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై పైచేయి సాధించడంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. అయితే ఇది సంబరాలు చేసుకునేంత విజయమా అంటే కాదనే అంటున్నారు రాజ్యాంగ నిపుణులు.

ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంలో మాత్రమే విజయం సాధించిందని.. కానీ అంతిమంగా ఈ బిల్లులను ఆపే శక్తి మండలికి లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ బిల్లులు రెండోసారి శాసనసభలో ఆమోదం పొంది మళ్ళీ మండలికి వస్తే చెయ్యగలిగింది ఏమి లేదని అన్నారు. ఒకవేళ ఆ బిల్లులను మండలి తిరస్కరించినా ప్రభుత్వానికి వచ్చే నష్టమేమి లేదని స్పష్టం చేశారు.

తెలుగుదేశం వ్యూహంలో భాగంగా సెలెక్ట్ కమిటీకి పంపించడం ద్వారా ఈ బిల్లులు మూడు నెలల పాటు శాసనమండలిలో ఉంటాయి.. అంతే తప్పా అడ్డుకునే అధికారం మాత్రం ఉండదని.. అదే క్రమంలో ప్రభుత్వానికి కూడా ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉండదని అన్నారు. బిల్లుల విషయంలో శాసనసభదే తుది నిర్ణయమని.. శాసనమండలి మూడు నెలల్లోపు తన అభిప్రాయం చెప్పాలి, మళ్ళీ శాసనసభ పంపిస్తే నెలలోపు అభిప్రాయం చెప్పాలి.. శాసనమండలి మహా అయితే నాలుగు నెలల వరకు ఆలస్యం చేయగలుగుతుంది అని అన్నారు నాగేశ్వర్.

కాగా మూడు రాజధానులు, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయించారు. తనకున్న విచక్షధికారాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. ఆ వెంటనే సభను నిరవధికంగా వాయిదా వేశారు. అంతకుముందు మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్ష టీడీపీ, అవసరం లేదని వైసీపీ సభ్యులు వాధించుకున్నారు. అయితే, చైర్మన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అధికార వైసీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధంమని ప్రభుత్వం పేర్కొంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories