తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది: సినీ నిర్మాత తమ్మారెడ్డి

తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తోంది: సినీ నిర్మాత తమ్మారెడ్డి
x
తమ్మారెడ్డి భరద్వాజ (ఫైల్ ఫోటో)
Highlights

రాష్ట్రానికి మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోమనండని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎద్దేవా చేశారు.

విశాఖపట్నం: రాష్ట్రానికి మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోమనండని సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎద్దేవా చేశారు. విశాఖలో 'పలాస- 1978' చిత్రం ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎక్కడ నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందని.. కొత్తగా పేర్లు పెట్టినంత మాత్రాన రాజధానులు కావని అన్నారు. మంచికో చెడుకో అమరావతి రాజధానిగా ప్రజాధనాన్ని రూ.7 వేల కోట్లు ఖర్చు పెట్టారని... మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తే అది పూర్తవుతుందనన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తూనే ఉన్నారని మండిపడ్డారు.

గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే అప్పటి ప్రభుత్వం తమతో వచ్చిన వారిని అరెస్టు చేసిందని.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్లే ప్రత్యేక హోదా కావాలని అంటున్నారని ధ్వజమెత్తారు. రాజధాని విషయం పక్కన పెడితే అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకుంటున్నారని అన్నారు. తెలుగు వాళ్లమని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories