బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అందులో ప్రయాణీకులు..

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అందులో ప్రయాణీకులు..
x
Highlights

బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అందులో ప్రయాణీకులు.. బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. అందులో ప్రయాణీకులు..

విధుల్లో ఉన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ కు గుండెపోటు వచ్చింది. అయినా తాను చనిపోతూ బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడాడు. ఈ ఘట్టన టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఖమ్మం నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు టెక్కలి దగ్గరకు రాగానే డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. దాంతో తీవ్రమైన నొప్పిని భరిస్తూ కూడా చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఆ తరువాత కొద్దిసేపటికే మృతిచెందాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు స్పల్ప గాయాలు మినహా అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తనకు గుండెపోటు వచ్చినా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ మృతిని ప్రయాణికులు తట్టుకోలేకపోయారు. దాంతో అక్కడ విషాదఛాయలు అలముకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories