బెజవాడలో స్కూల్ బస్సు బీభత్సం

బెజవాడలో స్కూల్ బస్సు బీభత్సం
x
Highlights

బెజవాడలో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. శారద కళాశాల సమీపంలో శ్రీ చైతన్య స్కూలు బస్ ఆటోలు,బైక్‌లను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సహా...

బెజవాడలో ప్రైవేట్ స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. శారద కళాశాల సమీపంలో శ్రీ చైతన్య స్కూలు బస్ ఆటోలు,బైక్‌లను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ సహా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినా కూడా ఆ బస్సు ఎక్కడ ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో స్థానికులు బస్సును వెంబడించారు. ఈఘటనలో బస్సులోని ముగ్గురు విద్యార్ధులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 20 మంది పైగానే విద్యార్ధులు ఉన్నట్టు సమాచారం. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories