కర్నూలులో ప్రైవేటు ఆస్పత్రుల బాగోతం

కర్నూలులో ప్రైవేటు ఆస్పత్రుల బాగోతం
x
Highlights

ప్రైవేటు ఆస్పుత్రులు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రోగులను భయపెట్టి డబ్బులు లాగడమే పనిగా పెట్టుకుంటున్నారు.

ప్రైవేటు ఆస్పుత్రులు దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. రోగులను భయపెట్టి డబ్బులు లాగడమే పనిగా పెట్టుకుంటున్నారు. లేని రోగాన్ని ఉన్నట్లు చిత్రీకరించి వేలాది రూపాయలు దండుకుంటున్నారు. ఇలాంటి ఘటన తాజాగా కర్నూలు నగరంలో వెలుగు చూసింది.

కర్నూలు పాతబస్తికి చెందిన అలీం, అయేషా దంపతుల 19 నెలల కుమార్తె ఆఫ్సాకు జలుబు చేయడంతో చందమామ ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి రక్తపరీక్షతో పాటు ఎక్సరే తీయాలని సూచించారు. క్లినిక్‌లోని తేజ ల్యాబ్‌లో E.S.R పరీక్షతో పాటు మూడు టెస్టులు చేయించి డాక్టర్‌కు అందించారు. ఎక్సరే రిపోర్ట్ పెండింగ్‌లో ఉంచారు.

మిగిలిన రిపోర్టులు చూసిన డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని.. అడ్మిట్ కోసం మరో ఆసుపత్రికి పంపించారు. అపోలో ఆసుపత్రిలో ఎక్సరే రిపోర్టులో పాపకు ఎటువంటి నిమోనియా లేదని రిపోర్టు ఇచ్చారు. ల్యాబ్ సిబ్బందిని, డాక్టర్‌ను తల్లిదండ్రులు నిలదీశారు. అపోలో ఆసుపత్రిలోనే తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఇక్కడి సిబ్బంది వాదించారు.

పాప తల్లిదండ్రులు తిరిగి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆ పాపకు మళ్లీ పరీక్షలు నిర్వహించారు. ఈసారి అపోలో సిబ్బంది వారికి పెద్ద షాక్ ఇచ్చారు. పాపకు నిమోనియా ఉందంటూ మళ్లీ రిపోర్టు ఇచ్చారు. పాత రిపోర్టులో నార్మల్ వచ్చిందని... మళ్లీ రిపోర్ట్ ఎలా మారుస్తారంటూ ఆందోళనకు దిగారు. రోగాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories