జగన్ మద్దతుకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్

జగన్ మద్దతుకి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్
x
Highlights

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద యుద్దాన్నే చేస్తున్నాయని చెప్పాలి. దీనిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించాయి. ఇక ఏప్రిల్ 5 న...

కరోనా పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద యుద్దాన్నే చేస్తున్నాయని చెప్పాలి. దీనిని అరికట్టేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించాయి. ఇక ఏప్రిల్ 5 న రాత్రి తొమ్మిది గంటలకి తొమ్మిది నిమిషాల పాటు దీపాలు వెలిగించాల‌ని మోదీ పిలుపు ఇచ్చిన విష‌యం తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా సినీ, రాజకీయ, వ్యాపార రంగాల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ప్రధాని మోదీకి మద్దతుగా ట్వీట్ చేశారు... అయితే దీనిపైన ప్రధాని మోడీ స్పందిస్తూ..

" ధన్యవాదాలు జగన్‌ గారూ. ఈ క్లిష్ట సమయంలో మీ సహకారం ఎంతో విలువైనది. కరోనాపై పోరాటంలో దేశ ప్రజల్లో సమైక్యత పెంపొందించడానికి అది ఎంతగానో దోహదపడుతుంది" అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

ఈ నెల 5వ తేదీన ఆదివారం రాత్రి ప్రధాని పిలుపు మేరకు ప్రజలు దీపాలు వెలిగించాలని, చెడు మీద మంచి.. చీకటి మీద వెలుగు గెలవాలని, అలాగే కరోనా మీద చేస్తున్న పోరాటంలో మానవాళి విజయం సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. మన శత్రువు కరోనా అని చాటి చెపుతూ.. కుల మతాలకు, ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా అందరం ఒక్కటేనని భారతీయులంతా ఏకమవ్వాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ళ ముంగిట దీపాలు, కొవ్వతులు, సెల్‌ఫోన్‌ లైట్లను వెలిగించాలని సీఎం సూచించారు. భారతీయులంతా ఒక్క తాటిమీదకు రావాలన్న ప్రధాని పిలుపునకు మద్దతు పలకాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories