ఒక రోజు పర్యటన కోసం ఇవాళ చిత్తూరు జిల్లాకు రానున్న రామ్‌నాథ్‌ కోవింద్

President Ram Nath Kovind One Day Tour  In Chittoor District
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఒక రోజు పర్యటన కోసం ఇవాళ చిత్తూరు జిల్లాకు రానున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు....

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఒక రోజు పర్యటన కోసం ఇవాళ చిత్తూరు జిల్లాకు రానున్నారు. బెంగళూరు నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లెకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. రాష్ట్రపతి తొలుత మదనపల్లెలోని సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్‌ అలీకి చెందిన సత్సంగ్‌ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ్య ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే భారత్ యోగా విద్యా కేంద్రానికి సంబంధించిన యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సుమారు మూడు గంటలపాటు రాష్ట్రపతి అక్కడే గడుపుతారు. అనంతరం సదుం మండలంలో ముంతాజ్‌ అలీ నిర్వహిస్తున్న పీపల్‌ గ్రో పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి తిరిగి బెంగుళూరు వెళతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories