చిత్తూరు జిల్లాలో రాష్ర్టపతి రాంనాథ్ కోవింద్ పర్యటన

X
రాంనాథ్ కోవింద్
Highlights
*సత్సంగ్ పౌండేషన్ ఆశ్రమ నిర్మాణానికి శంఖుస్థాపన *భారత్ యోగవిద్యా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
Samba Siva Rao7 Feb 2021 3:07 PM GMT
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో పర్యటించారు. సత్ సంగ్ ఫౌండేషన్ లో ఆశ్రమ నిర్మాణానికి శంకు స్థాపనచేసి...భారత్ యోగ విద్య కేంద్రాన్ని ప్రారంభించారు.ఆశ్రమంలోని శివాలయం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి హారతి ఇచ్చారు. విశ్వవిద్యాలయం ఆవరణలో రాష్ర్టపతి మొక్కలు నాటారు. ఆ తర్వాత 38 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సత్ సంగ్ విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. పీపుల్స్ గ్రో విద్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్రపతి పర్యటనలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Web TitlePresident Kovind inaugurates yogashala at Satsang foundation ashram in Chittoor District
Next Story