తిరుపతిలో దారుణం... రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి..!

* ఆస్పత్రిలో చేర్చుకొని యాజమాన్యం.. ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

R Tripura Malini
Published on: 21 Nov 2022 7:47 AM IST
pregnant woman gave birth to a baby on the road in tirupati
X

రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి

Tirupati: ఓ మహిళ నడిరోడ్డుపై శిశువుకు జన్మనిచ్చిన ఘటన తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఎటువంటి అపాయం కలుగకుండా ప్రసవించేలా సహాయం చేశారు. రోడ్డుపై బెడ్ షీట్‌ చాటున గర్భిణి ప్రసవించింది. గర్భవతికి తోడుగా అటెండర్ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు యాజమాన్యం. అయితే రూల్స్ ప్రకారం అటెండర్ లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకూడదనే నిబంధనలు ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story