AP Elections 2020: ప్రకాశం జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం.. ఆ మున్సిపాలిటీ షేర్..

AP Elections 2020: ప్రకాశం జడ్పీ చైర్మన్ అభ్యర్థి ఏకగ్రీవం.. ఆ మున్సిపాలిటీ షేర్..
x
Highlights

ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి బూచేపల్లి వెంకాయమ్మ విజయం సాధించారు.

ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థి బూచేపల్లి వెంకాయమ్మ విజయం సాధించారు.టీడీపీ, జనసేన ల తరుపున అభ్యర్థులెవ్వరు నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వెంకాయమ్మ ఎన్నిక ఏకగ్రీవమైంది. ప్రకాశం జిల్లా జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా వెంకాయమ్మను ప్రకటించారు. వెంకాయమ్మ.. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తల్లి. అంతేకాదు దర్శి మాజీ ఎమ్మెల్యే దివంగత బూచేపల్లి సుబ్బారెడ్డి సతీమణి. వైసీపీ స్థాపన నుంచి ఆ పార్టీలో కొనసాగుతోంది బూచేపల్లి కుటుంబం. రెండు సార్లు దర్శి ఎమ్మెల్యేగా పనిచేసింది. సంతనూతలపాడు, దర్శి నియోజకవర్గాల్లో ఆ కుటుంబానికి రాజకీయంగా మంచి పట్టు ఉంది.

2014 సాధారణ ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరుపున పోటీ చేసి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయినా సంతనూతలపాడు, దర్శి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. దాంతో వైసీపీ అధిష్టానం బూచేపల్లి కుటుంబానికి జడ్పీ పీఠం ఆఫర్ చేసింది. కాగా గడిచిన సాధారణ ఎన్నికల్లో దర్శి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కదిరి బాబురావు ఇటీవల వైసీపీలో చేరారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలను పట్టించుకోవడమే మానేశారు. దాంతో దర్శిలో చాలా చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.

మరోవైపు జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గం కొమరోలు జడ్పీటీసీ కూడా వైసీపీకి ఏకగ్రీవం అయింది. ఇక మార్కాపురం నియోజకవర్గంలో కూడా టీడీపీ కనీసం పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. దీనికి కారణం టీడీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఎన్నికలను సీరియస్ గా తీసుకోకపోవడమే. మార్కాపురం నియోజకవర్గంలో 10 ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయి. మార్కాపురం మున్సిపాలిటీని వైసీపీలోని రెండు వర్గాలకు విభజించారు. వైశ్య సామాజిక వర్గం నుంచి ఛిర్లంచెర్ల బాలమురళీకృష్ణ మూడేళ్లు, రెడ్డి సామాజిక వర్గం నుంచి డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ రెండేళ్లు పాలించేలా ఒప్పందం కుదిర్చారు. ఈ మున్సిపాలిటీలో కూడా అధికశాతం వైసీపీ అభ్యర్థులే నామినేషన్ వేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories