వింత : తల్లిదండ్రులు, ప్రజలకు వెలుగును చూపిస్తున్న ఆరునెలల చిన్నారి

వింత : తల్లిదండ్రులు, ప్రజలకు వెలుగును చూపిస్తున్న ఆరునెలల చిన్నారి
x
Highlights

వింత : తల్లిదండ్రులు, ప్రజలకు వెలుగును చూపిస్తున్న ఆరునెలల చిన్నారి

ఆరునెలల చిన్నారి ఏంటి.. వెలుగును చూపించడం ఏంటి అని ఆశ్చర్యపోకండి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న ముద్దులొలికే బుజ్జాయి ఒంట్లో విద్యుత్ ప్రవహిస్తోంది. బల్బ్ తగిలితే చాలు వెలుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా దామచర్ల గ్రామానికి చెందిన ఏలూరి హరిబాబు, సుస్మిత దంపతులకు ఆరు నెలల క్రితం పాప జన్మించింది. అయితే ఇటీవల ఆ పాప ఆడుకుంటూ ఆడుకుంటూ.. పక్కనే ఉన్న ఎల్‌ఈడీ బల్బ్‌ ను ముట్టుకుంది. దాంతో ఆ బల్బ్ సాధారణ బల్బ్ కంటే కాంతివంతంగా వెలిగింది. అది చూసి పాప తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.

ఖంగారుపడి డాక్టర్ దగ్గరకు తీసుకెళితే పాప ఒంట్లో విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పారు. దాంతో వారికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. పాప ఎదిగే క్రమంలో ఇది తగ్గుతుందేమోనని తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలిసి చుట్టు పక్కల గ్రామాల వారు వచ్చి పాపను చూస్తున్నారు. ఇదేమి వింత అని ఆశ్చర్య పోతున్నారు. ఇవేమీ తెలియని ఆ చిన్నారి బోసి నవ్వులతో అందరికి ఆనందాన్ని పంచుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories