'కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు'

కోడెల పోస్టుమార్టం నివేదిక అందలేదు
x
కోడెల శివప్రసాదరావు
Highlights

తెలుగురాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు అందలేదని తెలంగాణ పోలీసులు తెలిపారు.

తెలుగురాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాదరావు మృతికి సంబంధించిన కేసులో పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు అందలేదని తెలంగాణ పోలీసులు తెలిపారు. కోడెల కేసును విచారిస్తున్న బంజారాహిల్స్‌ పోలీసులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. గత సెప్టెంబర్‌ 16వ తేదీన కోడెల హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. అప్పట్లో ఈ కేసులో కోడెల కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు.

కోడెల సెల్‌ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కోడెల మృతి చెందిన రోజు ఘటనా స్థలంలో కొన్ని వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు. అయితే పోస్టుమార్టంకు సంబంధించిన నివేదిక ఇంకా అందలేదు. మరో వారం పది రోజుల్లో పడే అవకాశం ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే దర్యాప్తు వేగవంతం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మాజీ స్పీకర్ కోడెల గత సెప్టెంబర్‌ 16వ తేదీన హైదరాబాద్ నగరం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మృతి చెందారు.

తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలోనే ఆ పార్టీలో చేరారు కోడెల. ఆ తరువాత ఎన్టీఆర్ కు అత్యంత ఆప్తుడిగా మారారు. తెలుగుదేశం పార్టీలో చీలిక తరువాత కూడా కోడెలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు చంద్రబాబు. ఐదుసార్లు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఒక పర్యాయం సత్తెనపల్లి నియోజకవర్గంనుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో హోమ్ శాఖ మంత్రిగాను పనిచేశారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పనిచేశారు. పల్నాడులో అత్యంత ప్రజాధారణ ఆయన సొంతం, ఆయనను అభిమానులు ముద్దుగా పల్నాటి పులి అని పిలుచుకునేవారు. అటువంటి నేత సడన్ గా ఆత్మహత్య చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశయం అయింది. వైసీపీ పెట్టిన కేసుల వలనే కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని టీడీపీ ఆరోపిస్తుంటే.. టీడీపీ నుంచి నిరాదరణ కరువైన కారణంగానే మనస్థాపం చెంది కోడెల ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ ఆరోపిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories