వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు: రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం
x
Highlights

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి శనివారం రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రంగన్న మరణించారు. రంగన్న మరణంపై అనుమానాలున్నాయని ఆయన భార్య, కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్నారు. రంగన్న మరణంపై మార్చి 7న జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. రంగన్న కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రంగన్న డెడ్ బాడీకి రీపోస్టుమార్టం నిర్వహించారు.

పులివెందుల భాకరాపురం స్మశానవాటికలో పాతిపెట్టిన రంగన్న డెడ్ బాడీని వెలికితీశారు. తిరుపతి, మంగళగిరి నుంచి వచ్చిన ఫోరెన్సిక్ వైద్యుల ఆధ్వర్యంలో రీ పోస్టుమార్టం నిర్వహించారు. పులివెందుల ఆర్డీఓ సమక్షంలో రీపోస్టుమార్టం నిర్వహించారు. రంగన్న డెడ్ బాడీపై ఏమైనా గాయాలున్నాయా? లేదా అనే విషయంపై ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. రంగన్న వెంట్రుకలు, కాలి,చేతి వేళ్ల గోళ్లు కూడా సేకరించి ల్యాబ్ కు పంపనున్నారు.

2019 మార్చిలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాల కోసం సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దర్యాప్తులో వేగం పెంచాలని వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా సీబీఐ అధికారులను కోరారు. గతంలో దిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిసి మెమోరాండం సమర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories