విశాఖలో 'గో బ్యాక్ సీఎం' పోస్టర్ల కలకలం!

Posters Saying CM Go Back In Visakha
x

విశాఖలో ‘గో బ్యాక్ సీఎం’ పోస్టర్ల కలకలం!

Highlights

* రాజధాని అమరావతిని నిర్మించండి అంటూ ఫ్లెక్సీలు

Visakhapatnam: విశాఖలో సీఎం జగన్ వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపాయి. గో బ్యాక్ సీఎం సర్.. రాజధాని అమరావతిని నిర్మించండి అని రాసి ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. ఆంధ్రా యూనివర్సిటీ ప్రవేశద్వారం వద్ద, పలు కూడళ్లలో 'జన జాగరణ సమితి పేరుతో వీటిని ఏర్పాటు చేశారు. జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్ మెట్ట తదితర కూడళ్లలో పోస్టర్లు ఏర్పాటు చేసిన విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు.. వాటిని వెంటనే అక్కడి నుంచి తొలగించేశారు. రాజధాని విశాఖేనని, అక్కడి నుంచే త్వరలో పరిపాలన సాగిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిని అరెస్టు చేయాలంటూ మూడో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు. ప్రశాంతంగా ఉన్న వర్సిటీలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయని, గుర్తు తెలియని వ్యక్తులు వీటిని తెల్లవారుజామున అంటించినట్టు తెలుస్తోందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories