తెలంగాణలో ఆంధ్రావాళ్ళని కొడుతున్నారా? రుజువులు చూపించు పవన్ : పోసాని

తెలంగాణలో ఆంధ్రావాళ్ళని కొడుతున్నారా? రుజువులు చూపించు పవన్ : పోసాని
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రవాళ్లని కొడుతున్నారని పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీనటుడు పోసాని కృష్ణమురళి.. తెలంగాణ ప్రజలు...

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రవాళ్లని కొడుతున్నారని పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సినీనటుడు పోసాని కృష్ణమురళి.. తెలంగాణ ప్రజలు ఎక్కడెక్కడ ఎవరిని కొట్టారో పవన్ కళ్యాణ్ రుజువులు చూపించాలని ప్రశ్నించారు. కూకట్ పల్లిలో కొడుతున్నారా? లేక పఠాన్ చెరువులోనా, జూబిలీహిల్స్ లోనా అంటూ ఫైర్ అయ్యారు. ఆంధ్రులపై దాడులు జరుగుతుంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఊరుకుంటున్నారా?

ఆంధ్రాలో నాలుగు ఓట్లకోసం తెలంగాణ ప్రజలను నిందిస్తావా..? ఇది ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినట్టు కాదా అని అన్నారు. గతంలో మంచి సీఎం కేసీఆర్‌ అని, తెలంగాణ నాయకులనే స్ఫూర్తిగా తీసుకోవాలని పవన్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కేసీఆర్, కేటీఆర్ ను కలిసిన ఫోటోలను చూపించారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ కూతురు కవిత గురించి మాట్లాడుతూ 'బంగారు చెల్లీ వేల వేల అభినందనలు, హ్యాప్పీ బర్త్‌డే అంటూ ట్వీట్‌లు చేసింది మీరు కాదా' అని ప్రశ్నించారు. ఇక ఆంద్ర నాయకులకు సంబంధించిన ఆస్తులను కేసీఆర్ ఆక్రమించారని అంటున్నావు ఎక్కడైనా ఆంధ్రావారి భూములు లాక్కున్నట్లు చూపిస్తే పాదాభివందనం చేస్తానని' పోసాని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories