చంద్రబాబువి ముసలి కన్నీళ్లు .. పోసాని సంచలన వాఖ్యలు

చంద్రబాబువి ముసలి కన్నీళ్లు .. పోసాని సంచలన వాఖ్యలు
x
Highlights

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో...

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయన చంద్రబాబుపై కామెంట్స్ చేశారు. చంద్రబాబుని మించిన క్రిమినల్ మైండ్ మరెక్కడా ఉండదు అంటూ వాఖ్యానించారు పోసాని..

పొలిటికల్ అన్ ఎంప్లాయిమెంట్ అనే పేరుతో రాజకీయనాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ జనాన్ని పిచ్చోల్లని చేస్తున్నారని అయన అభిప్రాయపడ్డారు. ఇక ఏవోవే ఉద్యమాలు అంటూ చంద్రబాబు లాంటి వాళ్లు ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని అన్నాడు. అమరావతి రైతులను జగన్ మోసం చేస్తున్నాడని చంద్రబాబు ఆరోపణలు చేస్తే ఎలా నమ్ముతారని ప్రజలను ప్రశ్నించారు. చంద్రబాబు మాటలకి ఉద్రేకం పెరిగిపోయి అక్కడి వారు రోడ్లు మీదికి వస్తున్నారు. ఉద్రేకం పెరిగి గుండెనొప్పులు వచ్చి ఇద్దరో ముగ్గురో పోయారంటే దానికి కారణం చంద్రబాబు స్వార్ధమే తప్ప జగన్ ప్రభుత్వం వల్ల కాదని పోసాని వాఖ్యానించారు.

ఇక నన్ను చంపితే సీఎం అవుతారు అంటే చంద్రబాబు ననన్ను చంపేందుకు కూడా వెనుకాడడని అతనికి విలువలు లేవని చంద్రబాబుకి కేవలం సీటు, ఓటు, నోటు నోటు మాత్రమే కావాలని పదవి కోసం ఏమైనా చేస్తాడని పోసాని అన్నారు. నేను ఇలా నిజాలు మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు నాకు పిచ్చి అని అంటారు. నిజంగా ఎవరికీ పిచ్చో వారే ప్రశ్నించుకోవాలని పోసాని చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై నాకు ఎలాంటి పగ, ప్రతీకారాలు లేవని చంద్రబాబు ప్రజాసేవ చేసినప్పుడు సపోర్ట్ చేశానని, ఆయన ప్రచారానికి పేజీలు పేజీలు యాడ్‌లు చేశానని పోసాని అన్నారు.

ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అయన కూతురు ప్రేమ, పెళ్లి విషయంలో ఇంట్లో ఆడవాళ్లని కంట్రోల్ చేసుకోలేనివాడు దేశాన్ని ఏం కంట్రోల్ చేస్తాడని చిరంజీవిని నీ కింది నేతలతో చిరంజీవి అనిపించావా లేదా? రెండు మూడు నెలలు అదే పనిగా చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేయించావు. వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే కనీసం తప్పు అని చెప్పావా? అని పోసాని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories