ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా.. ఏ బ్యాంకులోనైనా..

ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా.. ఏ బ్యాంకులోనైనా..
x
Highlights

బ్యాంకింగ్ సర్వీసుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

నెల్లూరు: బ్యాంకింగ్ సర్వీసుల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కస్టమర్లకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా, ఈ పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే మరో సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఒక బ్యాంక్ కస్టమర్, మరో బ్యాంకుకు వెళ్లి తన ఖాతాలో డబ్బులు వేసుకునేలా... నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీపసీఐ) ప్రతిపాదనలు సిద్దం చేసింది. అంతేకాదు... వేరే బ్యాంక్ ఏటిఎం సెల్ఫ్ డిపాజిట్ మెషీన్ ద్వారా కూడా, మన బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు జమ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎన్‌పీసీఐ చేసిన ప్రతిపాదనలపై, వివిధ బ్యాంకులు సమాలోచనలు చేస్తున్నాయి. దేశంలో అన్ని రకాల చెల్లింపులకు సంబంధించిన బాధ్యతలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తోంది.

క్యాష్ డిపాజిట్ ఇంటర్ ఆపరబిలిటీ సేవల వల్ల బ్యాంకులతో పాటు, ఖాతాదారులు కూడా చాల ప్రయోజనాలు పొందవచ్చని ఎన్‌పీసీఐ ఆధారాలను చెబుతోంది. నగదు నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆపరేషన్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంటోంది. ఈ ప్రతిపాదనకు 14 బ్యాంకులు మొగ్గు చూపుతున్నాయి. ఆంధ్రా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. దాదాపు 30 వేల పైచిలుకు ఆటోమేటెడ్ టెల్లర్ మిషిన్స్‌(ఏటీఎం)లలో ఇంటర్ ఆపరబిలిటీ సర్వీసుల వెసులుబాటు కల్పించవచ్చని, దీనికి సాంకేతిక పరమైన ఇబ్బందులు కూడా పెద్దగా ఉండబోవని ఎన్‌పీసీఐ వెల్లడించింది.

ఇక ఈ సర్వీసులకు ఛార్జీలను కూడా ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. ఒక బ్యాంకు కస్టమర్, మరో బ్యాంకుకు కానీ, ఏటీఎంకు కానీ వెళ్లి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే.. రూ. 10 వేలలోపు అయితే రూ. 25, రూ. 10 వేలు దాటితే రూ. 50 లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఏటీఎంలో నగదు డిపాజిట్ చెయ్యడం వల్ల, నకిలీ నోట్లు ఎక్కువగా సర్క్యలేట్ అయ్యే ప్రమాదముందని భావిస్తుండడంతో, పలు బ్యాంకులు ఈ సర్విసులపై ఇంకా తర్జనభర్జనలు పడుతున్నాయి. ఇందుకోసం ఏటీఎంలలో సాఫ్ట‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసే దిశలో కూడా యోచిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories