K Vijayanand: కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నాం

Polling is Going on Peacefully and being Observed by Web Casting from the Control Room says Chief Electrol Officer K Vijayanand
x

కె. విజయానంద్ - బద్వేల్ ఉప ఎన్నికలు(ఫైల్ ఫోటో)

Highlights

* బద్వేల్ ఉపఎన్నిక కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసాం-కె. విజయానంద్

Badvel By-Election: బద్వేల్ ఉపఎన్నిక కోసం సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్. పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందన్నారు. మూడు చోట్ల ఈవీఎంలు పని చేయకపోవడాన్ని గుర్తించి వెంటనే వాటిని మార్చి వేశామన్నారు.

స్థానికంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే రాజకీయ నాయకులు వాటిని అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించామని తెలిపారాయన. ఓటింగ్ ప్రక్రియను 24 మంది అధికారులు పరిశీలిస్తున్నారని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు తమ దృష్టికి రాలేదన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె. విజయానంద్.

Show Full Article
Print Article
Next Story
More Stories