అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలో పోలింగ్ ఆలస్యం

X
Representational Image
Highlights
* 6వ వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఆగిన పోలింగ్ * క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఓటర్లు * పోలింగ్ ఆలస్యంపై కథనాలు ప్రసారం చేసిన హెచ్‌ఎంటీవీ
Sandeep Eggoju13 Feb 2021 3:31 AM GMT
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం అంకంపల్లిలో పోలింగ్ నిలిచిపోయింది. 6వ వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్స్ ఓపెన్ కాకపోవడంతో ఉదయం నుంచి పోలింగ్ ఆగిపోయింది. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు గంటలుగా పైగా క్యూలైన్లలో నిల్చొని వేచిచూశారు.
సమాచారం అందుకున్న హెచ్‌ఎంటీవీ పోలింగ్ ఆగిపోవడంపై కథనాలు ప్రసారం చేసింది. అప్రమత్తమైన అధికారులు 6వ వార్డుకు చేరుకొని సమస్యను పరిష్కరించారు. దీంతో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.
Web TitlePolling delayed in Beluguppa Anantapur district
Next Story