పర్చూరులో జరిగినట్టే చీరాలలో కూడా అలాగే జరుగుతుందా!

పర్చూరులో జరిగినట్టే చీరాలలో కూడా అలాగే జరుగుతుందా!
x
Highlights

పర్చూరులు దగ్గుబాటి వెంకటేశ్వరావును కాదని.. ఎన్నికలకు వారం రోజుల ముందు పార్టీని వీడిన రావి రామనాధం బాబును తిరిగి తీసుకువచ్చింది వైసీపీ. దాంతో దగ్గుబాటి ఫామిలీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ

పర్చూరులు దగ్గుబాటి వెంకటేశ్వరావును కాదని.. ఎన్నికలకు వారం రోజుల ముందు పార్టీని వీడిన రావి రామనాధం బాబును తిరిగి తీసుకువచ్చింది వైసీపీ. దాంతో దగ్గుబాటి ఫామిలీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పార్టీకి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం ఈ పంచాయితీ తెగకముందే వైసీపీ మరో సమస్యను కోరి తెచ్చుకుంటుందా అనే సందేహం మొదలైంది. చీరాల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఆయన సోదరుల వ్యవహార శైలిపై వైసీపీ ఆధిష్ఠానం గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఇన్‌చార్జ్‌గా వ్యవహరించి.. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన యడం బాలాజీని పార్టీలోకి తిరిగి తీసుకుని ఆమంచికి చెక్ పెట్టాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

యడం బాలాజీ కూడా పేరుకు టీడీపీలో ఉన్నా వైసీపీతోనే ఎక్కువ టచ్ లో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పర్చూరులో జరిగినట్టే బాలాజీని కూడా వైసీపీలోకి తీసుకుంటారని ఆయన వర్గం భావిస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఆమంచి కూడా కొంత అసంతృప్తితోనే ఉన్నారట. అయితే దగ్గుబాటి అంశం వేరే ఉంది కాబట్టి చీరాలలో మాత్రం పర్చూరులో జరిగినట్టు జరగదని ఆమంచి ధీమాగా ఉన్నారట. ఎటొచ్చి ఏమి జరుగుతోందో కాస్త క్లారిటీ తీసుకుంటే పోలా.. అని ఈ విషయంపై వైసీపీ అధిష్టానంతో ఆమంచి కృష్ణమోహన్ చర్చలు జరుపుతున్నారన్న టాక్ వినబడుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories