ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన నేతలు

ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన నేతలు
x
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, ప్రతిపక్షనేత వైయస్ జగన్, ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

'కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలి, 2019లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు' అంటూ సీఎం చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు.

ఇక ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'గత ఏడాదిగా నాకు అండగా ఉంటూ నాపై మీరు చూపించిన ప్రేమకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు కొత్త ఏడాదిలో ఆ దేవుడు ఆయురారోగ్యాలను, అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ట్విటర్‌లో వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.

గత ఏడాది అనుభవాలను ప్రేరణగా తీసుకుని నూతన నిర్ణయాలతో ముందడుగు వేద్దాం. ఈ కొత్త సంవత్సరంలో సామాన్యుడే రాజై వెలగాలని.. మానవీయ పాలనకు నవ చరిత్రకు ఇది శ్రీకారం కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ నూతన సంవత్సరం సందర్బంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు

Show Full Article
Print Article
Next Story
More Stories