Andhra Pradesh: తాడిపత్రిలో వేడెక్కిన రాజకీయాలు

Andhra Pradesh: తాడిపత్రి మున్సిపాలిటీలో సత్తా చాటిన టీడీపీ * 36 వార్డుల్లో 18 గెలిచిన టీడీపీ

Sandeep Eggoju
Published on: 15 March 2021 6:13 AM IST
Political Heat in Tadipatri Ananthapur District
X

ఫైల్ ఇమేజ్ 

Andhra Pradesh: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయాలు వేడెక్కాయి. తాడిపత్రి మున్సిపాలిటీలో ఎవరికి స్పష్టమైన ఆధిక్యంరాలేదు. ఈ నేపథ్యంలో గెలిచిన వారు అజ్ఞతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు.. తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ ఉనికి చాటుకుంది. మొత్తం 36 వార్డుల్లో 18 టీడీపీ గెలుచుకున్నట్టు తెలుస్తోంది. 16 వార్డుల్లో వైసీపీ గెలిచింది. రెండు చోట్ల ఇతరులు గెలిచారు. అయితే.. 24వ వార్డు నుంచి బరిలోకి దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీలతో గెలిచారు..

మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాడిపత్రి ప్రజల విజయమని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు ప్రజల్లో సేవ్ తాడిపత్రి నినాదం బాగా పనిచేసిందన్నారు. ఊరి మంచి కోసం అవసరమైతే సీఎం జగన్‌ను కలుస్తామన్నారు. వైసీపీ నుంచి గెలిచిన నలుగురు అభ్యర్థులు టచ్‌లో ఉన్నారని చెప్పారు. నాయకులు భయంతో ఏసీ రూముల్లో కూర్చున్నారని, కార్యకర్త కృషి వల్లే విజయం సాధ్యమైందన్నారు. అయితే.. జేసీ ప్రభాకర్ రెడ్డి గెలిచిన అభ్యర్ధులతో క్యాంప్‌కు బయల్దేరారు.. అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలుస్తోంది..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story