ప్రకాశం జిల్లాలో సంచలనం.. ఆమె బ్యాగులో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు

ప్రకాశం జిల్లాలో సంచలనం.. ఆమె బ్యాగులో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు
x
ప్రతీకాత్మక చిత్రం మరియు దర్యాప్తు చిత్రం
Highlights

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.....

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఈ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది అన్నట్టు.. బాలిక ఫిర్యాదు చేసిన సుమలత గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సత్‌ సంప్రదాయమైన కట్టూ బొట్టుతో కనిపించే సుమలతలో ఎవరికీ తెలియని వికృత చేష్టలు బయటికి వచ్చాయి. మగరాయుడిలా కనిపించేందుకు కృత్రిమ లైంగిక పరికరాలు అమర్చుకునేది.. అంతేకాదు సాటి ఆడవారితోనే అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. సుమలత చేసిన నీచమైన పనికి అవమానభారంతో భర్త ఏడుకొండలు బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

అసలు వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎనికెపాడుకు చెందిన గోనుగుంట ఏడుకొండలు గత కొంతకాలంగా కొండపిలో ఆర్‌ఎంపీగా ప్రాక్రీసు చేస్తుండేవాడు. అదే సమయంలో కొండపి మండలానికి చెందిన సుమలత కుట్టు మిషన్‌ నేర్చుకునేందుకు వెళ్తుండేది. ఈ క్రమంలో ఏడుకొండలు, సుమలతకు పరిచయం ఏర్పడింది. వేర్వేరు కులాలు కావడంతో మొదట వారి వివాహానికి పెద్దలు ఒప్పుకోలేదు.. అయితే సుమలతకు అప్పటికే రెండు వివాహాలు జరిగి విడిపోవడం జరిగింది. అలాగే ఏడుకొండలుకు కూడా అంతకుముందే వివాహం జరిగి విడాకులు అయ్యాయి. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏడేళ్ల కిందట వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరు ఒంగోలు మారుతీ నగర్‌కు మకాం మార్చారు. ఇప్పటికీ వీరికి సంతానం కలగలేదు.

ఇదిలావుండగా ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వ్యభిచార గృహం ఏమైనా నడుపుతున్నారా అనే అనుమానంతో ఏడుకొండలు ఇంటికి తనిఖీ చేశారు. దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సుమలతకు చెందిన ఓ బ్యాగులో కృత్రిమ జననాంగాలను పోలిన వస్తువులు కనిపించాయి. ప్రేమికుడి పేరుతో బాలికలకు రాసిన ప్రేమలేఖలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు సదరు మహిళా అసహజ లైంగిక కార్యకలాపాలకు అలవాటుపడిందని గుర్తించారు. ఈ క్రమంలోనే మైనర్‌ను ట్రాప్‌ చేసి మగ వేషంలో లైంగిక దాడికి పాల్పడింది కూడా సుమలతగానే నిర్దారణకు వచ్చారు. ఆమె కాల్‌ డేటాను కూడా పరిశీలించారు. ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్‌ చేసినట్లుగా గుర్తించారు. అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే తన భార్య వల్లే ఇదంతా.. అంటూ అవమాన భారంతో ఏడుకొండలు పెంట్‌ హౌస్‌ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరోవైపు బాలికపై అసహజ లైంగిక దాడికి పాల్పడిందనే ఫిర్యాదుపై జరుగుమల్లి పోలీసులు సుమలతను అరెస్టు చేశారు. కందుకూరు న్యాయమూర్తి సుమలతకు 15 రోజుల రిమాండ్‌ విధించగా ఆమెను ఒంగోలు జిల్లా జైలుకు తరలించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories