Tirupati: తల్లిదండ్రులే హంతకులు.. చెరువులో లభ్యమైన చిన్నారి డెడ్‌బాడీ కేసులో వీడిన మిస్టరీ

Police Solve The Case Of The Child Dead Body Found In The Pond
x

Tirupati: తల్లిదండ్రులే హంతకులు.. చెరువులో లభ్యమైన చిన్నారి డెడ్‌బాడీ కేసులో వీడిన మిస్టరీ

Highlights

Tirupati: వైద్య ఖర్చులు భరించలేక ఘాతుకానికి పాల్పడిన పేరెంట్స్

Tirupati: కడుపు పంచిన ఆ తల్లిదండ్రులే కన్నపేగును తెంచుకున్నారు. అంగవైకల్యంతో ఉందనే కారణంతో ఆ పసి హృదయాన్ని చిదిమేశారు. ఏ పాపమూ తెలియనీ ఆ పసి ప్రాణంపై మృత్యువు తల్లిదండ్రుల రూపంలో బలి తీసుకుంది. తిరుపతి జిల్లా చిట్టమూరులో వారం రోజుల క్రితం చెరువులో శవమై తేలిన బాలిక మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తిరుపతి జిల్లా చిట్టమూరు సమీపంలోని చెరువులో లభ్యమైన చిన్నారి మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. జనవరి 24న ఓ చిన్నారి మృతదేహం తేలియాడుతూ కనిపించింది. చిన్నారి డెడ్‌బాడీని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసుల విచారణలో ఊహించని నిజాలు బయటపడ్డాయి. చిన్నారి తల్లిదండ్రులనే హంతకులుగా తేల్చారు పోలీసులు. పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించిన కూతురిని వదిలించుకునేందుకు...తల్లిదండ్రులే చిన్నారిని గొంతు నులిమి చంపి చెరువులో పడేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

అయితే చిన్నారి పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించడంతో వైద్య సేవలు అందించలేకనే ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. మరో వైపు తమ ఆర్థిక పరిస్థితి, చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై రోజురోజుకు సమస్యలు పెరుగుతుండడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories