నాటు సారాపై పోలీసులు దాడులు.. వేల లీటర్ల పులుపు ధ్వంసం

నాటు సారాపై పోలీసులు దాడులు.. వేల లీటర్ల పులుపు ధ్వంసం
x
Highlights

వైన్ షాపుల్లో బాటిల్స్ ధర పెరగడం, అనుకున్న బ్రాండ్ లేకపోవడంతో అందరూ నాటుసారావైపు మళ్లుతున్నారు. గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో విచ్ఛలవిడిగా తయారు...

వైన్ షాపుల్లో బాటిల్స్ ధర పెరగడం, అనుకున్న బ్రాండ్ లేకపోవడంతో అందరూ నాటుసారావైపు మళ్లుతున్నారు. గ్రామాల్లో, మారుమూల పల్లెల్లో విచ్ఛలవిడిగా తయారు చేయడమే కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. వీటిని నిరోధించేందుకు ఎక్సైజ్ శాఖ వద్ద అవసరమైన సిబ్బంది లేకపోవడంతో పోలీసులు సైతం దాడులు చేస్తున్నారు. దీనిలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో సోమవారం రాత్రి వరకు నిర్వహించిన దాడుల్లో పులుపు, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని నర్సీపట్నం రూరల్ సర్కిల్ దుగ్గాడ గ్రామ పొలిమేరలో 1000 లీటర్ల బెల్లం పులుపును ఎస్సై టీ.రవి కుమార్ మరియు సిబ్బంది ధ్వంసంచేశారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నవరం గ్రామ పొలిమేరలో 1000 లీటర్ల బెల్లం పులుపును నర్సీపట్నం రూరల్ సర్కిల్ సిఐ అప్పలనాయుడు, ఎస్సై ఎల్.సురేష్ మరియు సిబ్బంది ధ్వంసంచేశారు.

నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మాసంపల్లి గ్రామ పొలిమేరలో 270 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకొని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఎస్సై జె.రమేష్ మరియు సిబ్బంది. ఎలమంచిలి సర్కిల్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లవరం గ్రామ పొలిమేరలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్సై జి.లక్ష్మణ్ రావు మరియు సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు చేసి, ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.72,240/- నగదు స్వాధీనం చేసుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories