అత్యాచార నిందితునికి బడితే పూజ

అత్యాచార నిందితునికి బడితే పూజ
x
Highlights

చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి అంతమొందించిన సంఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 23 రాత్రి ఆరో తరగతి చదువుతున్న ఓ...

చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి అంతమొందించిన సంఘటన మరవకముందే మరో దారుణం చోటుచేసుకుంది. ఈ నెల 23 రాత్రి ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ ఘటన కలికిరి మండలం కొట్టాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వీరభద్రయ్య అదే గ్రామానికి చెందిన బాలికను మాయమాటలు చెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు కలికిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు. అతను పారిపోవడానికి యత్నించడంతో పోలీసులు, స్థానికులు పట్టుకుని బడితే పూజ చేశారు. ఈ దృశ్యాన్ని వీడియో తీయడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories