ఉల్లి విక్రయాలకు పోలీసుల రక్షణ

ఉల్లి విక్రయాలకు పోలీసుల రక్షణ
x
టౌన్ ఎస్ ఐ రాజేష్ కుమార్
Highlights

జిల్లాలో పదిహేను రైతు బజార్ లు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై రూ 25 కే ప్రజలకు వీటిని రైతు బజార్ ల ద్వారా సరఫరా చేస్తోంది.

మండపేట: జిల్లాలో పదిహేను రైతు బజార్ లు ఉన్నాయి. ప్రభుత్వం సబ్సిడీపై రూ 25 కే ప్రజలకు వీటిని రైతు బజార్ ల ద్వారా సరఫరా చేస్తోంది. సామాజిక మాధ్యమలో ఇప్పుడు ట్రోల్ అవుతున్న ప్రధాన అంశం ఉల్లిపాయలే. ఎవరికి నచ్చినట్లు వారు ఉల్లి ధర పై సటైర్లు వేస్తూ వ్యంగ్యంగా అస్త్రాలు సంధిస్తున్నారు. ఇందులో ఉల్లి ఉన్న వారి కూడా బోన్సార్ లు ఉన్నట్టు చూపిస్తున్నారు. ఈ నేపద్యంలో మండపేట గాంధీ నగర్ లోని రైతు బజార్ వద్ద దాదాపు 8 మంది పోలీ సులు బందోబస్తు నిర్వహించడం విశేషం. చాంతాడం తా క్యూ లైన్ లో నిల్చున్న మహిళలు సహనం కోల్పోయి ఒకరితో ఒకరు తగాదాలు పడుతూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.ఎప్పటికి ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయో నని చర్చించుకుంటున్నారు.నాసిరకంగా ఉన్నాయి...నాసిరకం ఉల్లిపాయలు సరఫరా చేస్తున్నారని మహిళలు ఆరోపించారు.

కర్నూలు నుండి దిగుమతి చేసుకున్న ఈ చిన్న ఉల్లిపాయలు వాడితే కూరలు నల్లగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండపేట లో శుక్రవారం ఓ మహిళా ఉల్లి పాయలు నాసిరకం ఇచ్చారని ఆగ్రహం తో ఊగి పోతూ ఉల్లి సంచి ని కింద పడేసింది. ఎన్నికల్లో వంగి వంగి దండం పెట్టి ఇప్పుడు కనీసం నాణ్యమైన ఉల్లి ఇవ్వలేకపోతున్నారని ధ్వజమెత్తింది. ఇదిలా ఉండగా టౌన్ ఎస్ ఐ రాజేష్ కుమార్,ఏఎస్ఐ రెడ్డి ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories