తిరుమల సాక్షిగా... పోలీసులు అండగా.. ఒక్కటైన కొత్తజంట

తిరుమల సాక్షిగా... పోలీసులు అండగా.. ఒక్కటైన కొత్తజంట
x
Highlights

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం మామూలుగా లేదు. రోజురోజుకి ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం మామూలుగా లేదు. రోజురోజుకి ఈ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అందులో భాగంగానే నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఆలయాలను మూసివేశారు. ఇక తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులను అనుమతించడంలేదు. అలిపిరి దారి, మెట్ల మార్గాలు పూర్తి మూసివేశారు.

అయితే తిరుపతిలో పెళ్లి చేసుకుందామని అనుకున్న ఓ కొత్త జంట అలిపిరి వద్దే పెళ్లి చేసుకుని వెనుదిరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన ఓ జంట బంధువులతో కలిసి అలిపిరి వద్దకి చేరుకోగానే పోలీసులు అనుమతించలేదు.

దీంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితిలో పోలీసులు వారికి ఓ సలహా ఇచ్చారు. అలిపిరి వద్ద ఉన్న గరుడ విగ్రహం సాక్షిగా పెళ్లి చేసుకోమని చెప్పగా, దీనికి బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోగా విగ్రహం ముందు రోడ్డుపైనే వరుడు వధువు మెడలో తాళి కట్టాడు.. ఇక పోలీసులు ఈ వివాహానికి పెద్దలుగా వ్యవహరించి అక్షంతలు వేసి ఆశీర్వదించారు.. ఇందులో తిరుపతి డీఎస్పీలు నాగ సుబ్బన్న, మురళీకృష్ణలు ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories