పోలీసులే సివిల్ దుస్తువుల్లో వచ్చి రాళ్లేశారు

పోలీసులే సివిల్ దుస్తువుల్లో  వచ్చి రాళ్లేశారు
x
TDP MP GALLA JAYADEV
Highlights

పోలీసులు తనపై దాడి చేస్తుంటే మహిళలు అడ్డుపడ్డారని టీడీపీ ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.

పోలీసులు తనపై దాడి చేస్తుంటే మహిళలు అడ్డుపడ్డారని టీడీపీ ఎంపీ ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా తన తగిలిన దెబ్బలు మానలేదని నొప్పులు అలానే ఉన్నాయని తెలిపారు. రాజధాని అమరావతి కొనసాగించాలని అమరావతి పరిరక్షణ సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీడీపీ ఎంపీ గల్లాజయదేశ్‌ను పోలీసులు అరెస్ట్ సంగతి తెలిసిందే.

పోలీసులు అరెస్ట్ చేసే క్రమంలో తనను విపరీతంగా గిచ్చారని గల్లా జయదేవ్‌ ఆరోపించారు. ఇలా ఎందుకు చేశారో తెలుసుకుని ఆశ్ఛర్యానికి గురైయ్యాని చెప్పారు. పోలీసులు దాడి చేస్తుంటే కొందరు మహిళలు అడ్డుకున్నారన్నారని, మొదట తనకేం అర్థం కాలేదని పోలీసులు ఎందుకలా చేస్తా గిచ్చుతారో తెలియదని అన్నారు. ఎస్పీ లాఠీతో కొడతారేమో అని భయపడ్డానని చెప్పారు.

పోలీసుల దెబ్బలు కనిపించకుండా గిచ్చుతారని అర్థమైందని, ఎంపీ తననే దారుణంగా హింసిస్తే సామాన్యుల పరిస్థి ఏంటని గల్ల జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని మార్చమని వైసీపీ నేతలే అనేక సార్లు వెల్లడించారని జయదేవ్ గుర్తు చేశారు. ప్రభుత్వం మరోసారి రాజధాని తరలింపు విషయాన్ని పునరాలోచించాలన్నారు. అసెంబ్లీ ముట్టడిలో పోలీసుల్లోనే కొందర రాళ్లు వేసి ఉంటారని, తాము రాళ్లు రువ్వలేదని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories