అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై పోలీసుల విచారణ

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై పోలీసుల విచారణ
x
Highlights

* ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కేసు నమోదు * పెద్దారెడ్డి కుమారులు, అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు * జేసీ ప్రభాకర్‌ ఇంటిపై దాడి ఘటనలో కేసు నమోదు * జేసీ తరపున ఫిర్యాదు చేసిన న్యాయవాది శ్రీనివాసులు

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. తాజాగా.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి మారణాయుధాలతో చొరబడి, దాసరి కిరణ్‌పై దాడి చేశారని జేసీ తరపు న్యాయవాది శ్రీనివాసుల ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ఇంటిపై రాళ్ల దాడి చేసిన పెద్దారెడ్డి కుమారులు హర్షవర్దన్, సాయిప్రతాప్‌ రెడ్డి, అనుచరులపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరుల దాడి ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. జేసీ తరపు న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదుతో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్షవర్దన్‌ సహా పలువురు అనుచరులపై కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. పోలీసుల వైఖరిని న్యాయవాది శ్రీనివాసులు తప్పుబట్టారు. దాడి ఘటనపై సీఎస్‌, డీజీపీ, డీఐజీ, పోలీస్‌ ఉన్నతాధికారులకు సమాచారం మాత్రమే ఇచ్చామని.. తాను, జేసీ ప్రభాకర్‌రెడ్డి సహా ఎవరూ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories