Amaravati: రాజధాని గ్రామాల్లో పోలీసుల హై అలర్ట్

Amaravati: పోలీస్‌ వలయంలో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాలు * 13 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలతో భద్రత

Sandeep Eggoju
Published on: 8 Aug 2021 12:38 PM IST
Police High Alert in Amaravati Villages
X

అమరావతి గ్రామాల్లో పోలీసుల హై అలెర్ట్ 

Amaravati: రాజధాని గ్రామాల్లో పోలీసుల హై అలర్ట్ ప్రకటించారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో భారీగా పోలీసులు మోహరించారు. 13 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలతో భద్రత ఏర్పాటు చేయగా 91 మంది ఎస్సైలు, 1800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతను గుంటూరు రేంజ్‌ ఐజీ త్రివిక్రమ్‌ వర్మతో పాటు రూరల్‌ ఎస్పీ, అర్బన్ ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు మహిళలు యత్నించగా ఉండవల్లి వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌ వాహనం ఎదుట బైఠాయించి మహిళలు నిరసనకు దిగారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story