పోలీసు శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుంది

పోలీసు శాఖ 24 గంటలు అందుబాటులో ఉంటుంది
x
ఎస్.పి. ఐశ్వర్య రస్తొగి
Highlights

మహిళలు, యువతులు బాలలపై జరిగే అఘాయిత్యాలు, భౌతిక దాడులు నిరోధించడానికి, వారి రక్షణ కోసం నెల్లూరు జిల్లా పోలీసు శాఖ, 24 గంటలు అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్.పి తెలిపారు.

నెల్లూరు: మహిళలు, యువతులు బాలలపై జరిగే అఘాయిత్యాలు, భౌతిక దాడులు, అత్యాచారాలను నిరోధించడానికి, వారి రక్షణ కోసం నెల్లూరు జిల్లా పోలీసు శాఖ, 24 గంటలు అందుబాటులో ఉంటుందని నెల్లూరు జిల్లా ఎస్.పి. ఐశ్వర్య రస్తొగి తెలిపారు. ఆయన మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళల భద్రత మనందరి భాధ్యతని, జిల్లా వ్యాప్తంగా శక్తి టీం, మహిళా పోలీసు బృందాలతో పాటు బ్లూకొల్ట్స్, రక్షక్, హైవే పెట్రోలింగ్ సేవలను జిల్లా ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. డయల్ 100 కు అర్బన్ పరిధిలో 5 నుండి 10 నిముషాల లోపు, గ్రామాలలో 10 నుండి 15 నిముషాలలోపు స్పందించడం జరుగుతుందని చెప్పారు.

జిల్లాలో అత్యాధునిక కమాండెంట్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన డయల్ 100 కు, పబ్లిక్ ఐ వాట్సాప్ నెంబర్: 9390777727 జిల్లా ప్రజలు వారి సమస్యలు, సమాజంలో జరిగే వివిధ ఆసాంఘీక కార్యకలాపాలు, బహిరంగ మద్యపానం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలతో పాటు ఇసుక, ఎర్రచందనం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ నిల్వల గురించి సమాచారం అందించాలని తెలిపారు.

మహిళల , ఇతర సమస్యల ప్రాముఖ్యతను బట్టి వెంటనే కమాండ్ కంట్రోల్ తో పాటు, లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. బ్లూకోల్ట్స్, శక్తీ టీం లు , రక్షక్ లు సకాలంలో స్పందించి, పరిష్కరిస్తారని ఎస్ పి ఐశ్వర్య రస్తోగి స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories