మాస్క్ లేకుంటే క్వారెంటైన్ కే : పోలీసుల యాక్షన్

మాస్క్ లేకుంటే క్వారెంటైన్ కే : పోలీసుల యాక్షన్
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తిని 80 శాతం వరకు అడ్డుకునేది కేవలం మాస్క్ తోనే.

కరోనా వైరస్ వ్యాప్తిని 80 శాతం వరకు అడ్డుకునేది కేవలం మాస్క్ తోనే. చేతులు తరచూ కడుక్కోవడం... శానిటైజర్ వాడటం... ఇంతవరకు ఇవి తప్పించి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. వీటిని పెట్టుకోకపోతే జరిమానా విధిస్తామని చెబుతున్నా లెక్కచేయడం లేదు...జరిమానా అయితే కట్టేద్దాంలే అనుకుని యధేశ్చగా తిరుగుతున్నారు. ప్రభుత్వం ఇన్ని విధాలుగా చెబుతున్నా జనాలు ఎందుకో మాస్క్ పెట్టుకోరు.. అలానే తిరిగేస్తుంటారు... ఈ రోజు కేసులు పెరిగి పోవడానికి ప్రధాన కారణం కూడా ఇదే... ఇలా ఎన్నిసార్లు చెబుతున్నా ప్రజల తీరులో మార్పు లేదని విషయాన్ని గమనించిన పోలీసులు వినూత్న చర్యలు చేపడుతున్నారు. ఇంతవరకు హెల్మెట్ పెట్టుకోకుంటే రూ. 150 వసూలు చేస్తూ, మాస్క్ పెట్టుకోకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తున్నారు.

తాజాగా మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తే ఏకంగా క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం పోలీసులు కూడళ్ల వద్ద కాపు కాశారు. ఎవరైనా మాస్కు లేకుండా కనిపిస్తే చాలు.. అక్కడికక్కడే ప్రత్యేక వాహనాల్లో ఎక్కించి క్వారంటైన్‌కు తరలించారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లులో అలా మొత్తం 110 మందిని పంపించారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటే మిగతా వాళ్లు మాస్కు ధరిస్తారని పోలీసులు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి చర్యలు చేపడితే బావుంటుందని పలువురు అంటున్నారు. మాస్క్ లేకుండా వచ్చే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories