అయోధ్య తీర్పు : ఆంధ్రప్రదేశ్ లో హై అలర్ట్

అయోధ్య తీర్పు : ఆంధ్రప్రదేశ్ లో హై అలర్ట్
x
Highlights

అయోధ్య తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో హై అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు...

అయోధ్య తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో హై అలర్ట్ చేసింది ప్రభుత్వం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఘర్షణలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో చిన్న ఇబ్బంది కూడా తలెత్తకూడదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా అయోధ్య కేసులో తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. డీజీపీ గౌతం సవాంగ్‌ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories