బోండా ఉమాకు పోలీసుల షాక్..

బోండా ఉమాకు పోలీసుల షాక్..
x
Highlights

టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని ఆయనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు...

టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు పోలీసులు షాక్ ఇచ్చారు. పోలీసులను అసభ్య పదజాలంతో దూషించారని ఆయనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మూడు రోజుల కిందట డ్యూటీలో ఉన్న యస్.ఐ. అర్జున్, పోలీస్ సిబ్బందిపై బోండా ఉమా అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై కేసు నమోదయ్యింది. ఆయనపై పోలీసులు 353, 506, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా అమరావతి రాజధాని ఉద్యమంపై ఆందోళన చేసేందుకు విజయవాడలోని తన ఇంటి నుండి.. ర్యాలీగా బయలుదేరిన బోండా ఉమాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బోండా ఉమాకు మధ్య తీవ్ర విగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో సహనం కోల్పోయిన బోండా.. పోలీసులు, ఎస్సైని దూషించారు.

కాగా అమరావతి ఉద్యమంలో బోండా ఉమ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, బాలకృష్ణ అల్లుడు భరత్, పయ్యావుల కేశవ్, పత్తిపాటి పుల్లారావులు అమరావతి లో భూములు కొన్నారంటూ వైసీపీ నేతలు అవాకులు చెవాకులు పేల్చుతున్నారని.. టీడీపీ నేతలు భూములు కొనుగులో చేయడం అక్రమమైతే..వైసీపీ నేతలు భూములు కొనుగోలు చేయడం సక్రమం అవుతుందా అని వైసీపీ నేతలకు ప్రశ్నలు సంధించారు బోండా. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి భార్య పేరిట ఉన్న ఐదెకరాల భూములు గురించి స్పందించాలని అన్నారు.

అమరావతిలో వైసీపీ ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తోపాటు ఉండవల్లి శ్రీదేవి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరి శంకర్ రావు లు భూములు కొన్నారని.. వారిది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని ప్రశ్నించారు. అయితే బోండా ఉమకు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్ ఇచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి తాను భూమి కొన్నానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలాగే బొల్లా బ్రహ్మనాయుడు కూడా దీనిపై వివరణ ఇచ్చారు. తన కుమారుడికి లింగమనేని రమేష్ అనే వ్యక్తి డబ్బులు బాకీ ఉన్నాడని.. దాంతో 2016 లో భూమి రాసి ఇచ్చాడని తెలిపారు.బోండా ఉమాకు పోలీసుల షాక్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories