ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్..

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్..
x
Highlights

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్..

ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు షాక్ తగిలింది. ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదయింది. అఖిల ప్రియా భర్త భార్గవ్ రామ్ క్రషర్ ఇండస్ట్రీ తనకు ఇవ్వాలని యజమాని శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి చేస్తున్నాడని, బెదిరిస్తున్నాడని ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా భూమా దంపతులు బ్రతికున్న సమయంలో శివరామిరెడ్డి, భూమా కుటుంబానికి ఇద్దరికి కలిసి క్వారీ ఉంది.

అయితే భూమా దంపతులు మరణించిన అనంతరం అఖిల ప్రియను భార్గవ్ రామ్ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో క్వారీ తమకే చెల్లుతుందని.. క్వారీని ఇచ్చేయాలని భార్గవ రామ్ శివరామిరెడ్డితో అన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో శివరామిరెడ్డి, భార్గవ రామ్ మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్టు సమాచారం. అయితే బుధవారం భార్గవ్ రామ్ కు చెందిన వర్గీయులు క్వారీని ధ్వంసం చేసినట్టు శివరామిరెడ్డి తెలిపారు. అంతేకాదు క్వారీని తనకు ఇవ్వాలని భార్గవ రామ్ తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు శివరామిరెడ్డి. ఈ మేరకు ఆళ్లగడ్డ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories